రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-01T05:49:30+05:30 IST

రైతుల సంక్షేమమే ధ్యేయం

రైతుల సంక్షేమమే ధ్యేయం
మాట్లాడుతున్న చైర్మన్‌

ఆదిభట్ల, సెప్టెంబరు 30: రైతు సంక్షేమమే ధ్యేయమని మంగల్‌పల్లి సొసైటీ చైర్మన్‌ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి మంగల్‌పల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.  సొసైటీ ద్వారా 613మంది రైతులకు రూ.కోటీ 3లక్షల దీర్ఘకాలిక రుణాలు అందజేసినట్లు తెలిపారు. రుణాలు పొందిన రైతులకు బీమా వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతో పోచారంలో రెండెకరాల్లో గోదాం స్థలం సేకరించామన్నారు.  సమావేశంలో వైస్‌చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు సీఈవో  మాధవి పాల్గొన్నారు.

Read more