వర్గీకరణపై వైఖరి ప్రకటించకుంటే బీజేపీ నాయకులను ప్రతిఘటిస్తాం

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

వర్గీకరణపై వైఖరి ప్రకటించకుంటే బీజేపీ నాయకులను ప్రతిఘటిస్తాం

వర్గీకరణపై వైఖరి ప్రకటించకుంటే బీజేపీ నాయకులను ప్రతిఘటిస్తాం
మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ కృష్ణ

తలకొండపల్లి, జూలై 5:ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం తన వైఖరిని ప్రకటించకుంటే తెలంగాణలో ఆ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనీయకుండా ప్రతిఘటిస్తామని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ కృష్ణ మాదిగ, జిల్లా నాయకుడు కుమార్‌ అన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ 8ఏళ్లైనా చేపట్టకుండా మాదిగలను మోసగించిందని వారు మండిపడ్డారు. తలకొండ పల్లిలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆ పార్టీ వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లో ర్వహించిన విజయ సంకల్ప సభలో నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం సరికాదన్నారు. మాదిగల సంక్షేమం పట్ల బీజేపీకి చిత్తశుద్ధికి ఈ సంఘటనే నిదర్శనమని కృష్ణ, కుమార్‌ అన్నారు. వర్గీకరణ సాధించే వరకు ఎమ్మార్పీఎస్‌ పోరాటం ఆపదని అన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు దరువుల రాజు, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:30:00+05:30 IST