న్యాయం జరిగే వరకు పోరాడుతాం

ABN , First Publish Date - 2022-09-20T04:53:23+05:30 IST

తమకు న్యాయం జరిగే వరకు భూపోరాటం ఆపమని

న్యాయం జరిగే వరకు పోరాడుతాం
నిరసన తెలుపుతున్న భూనిర్వాసితులు

షాబాద్‌, సెప్టెంబరు 19 : తమకు న్యాయం జరిగే వరకు భూపోరాటం ఆపమని చందన్‌వెళ్లి భూనిర్వాసితులు తేల్చి చెప్పారు. 51 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదనవ్యక్తం చేశారు. సోమవారం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బాధితులు మాట్లాడుతూ... న్యాయంపరంగా తమకు రావాల్సిన భూపరిహారం తమకు అందేవరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు అంజనేయులు, కార్యదర్శి శోభ, ఉపాధ్యక్షులు గిరిబాబు, సభ్యులు కిషన్‌, బాలమణి, యూసుఫ్‌, రైతులు జంగయ్య, నర్సింహులు, జరీనాబేగం, పెంటమ్మ, మల్లేష్‌, యాదమ్మ ఉన్నారు. Read more