13న అసెంబ్లీని ముట్టడిస్తాం

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

13న అసెంబ్లీని ముట్టడిస్తాం

13న అసెంబ్లీని ముట్టడిస్తాం

  • టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రత్నం

వికారాబాద్‌, సెప్టెంబరు 10: ఈనెల 13న అసెంబ్లీని ముట్టడించి తీరుతామని టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వెంకట్‌రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు, 317 బాధితులకు న్యాయం, విద్యావలంటీర్లు, పారిశుధ్య కార్మికుల నియామకం తదితర సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా యుయుఎస్పీసీ ఆధ్వర్యంలో నేటి నుంచి హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతించలేదన్నారు. రోజుకు 50 మందితో శాంతియుతంగా చేసే నిరాహార దీక్షలకు కూడా అనుతించలేని పోలీసుల నిరంకుశ వైఖరిని యయుయస్పీసీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అందుకు నిరసనగా సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ 13న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ముట్టడి జరుపాలని యుయుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించిందన్నారు.


Read more