అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాం

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాం

అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాం
మోమిన్‌పేట్‌: అతిథి గృహాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

మోమిన్‌పేట్‌/వికారాబాద్‌, సెప్టెంబరు 8 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎల్లవేళలా అభివృద్ధికి కృషి చేస్తామని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అతిథిగృహాన్ని వారు ప్రారంభించారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.శ్రీకాంత్‌గౌడ్‌, సొసైటీ చైర్మన్‌ బి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్‌.నర్సింహారెడ్డి, హరిశంకర్‌, వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రాయన్‌పల్లి కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ను వారు ప్రారంభించారు. అదేవిధంగా నందివాగు చెరువులో ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు. నాయకులు, తదితరులున్నారు. అలాగే వినాయకుల నిమజ్జనం పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అధికారులకు సూచించారు. ధారూరు మండలం ఎబ్బనూర్‌ చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనర్‌ శరత్‌చంద్ర, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


Read more