పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తాం

ABN , First Publish Date - 2022-11-08T23:34:29+05:30 IST

దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ, మహేందర్‌రెడ్డి అన్నారు.

పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తాం
షాబాద్‌: రాజేందర్‌రెడ్డికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, జడ్పీచైర్‌పర్సన్‌

చేవెళ్ల/షాబాద్‌, నవంబరు 8: దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ, మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాజేందర్‌రెడ్డి 67వ జయంతి సందర్బంగా చేవెళ్ల, షాబాద్‌ మండల కేంద్రాల్లోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కేఎ్‌స.రత్నం, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మిలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, ఎంపీపీ ప్రశాంతిమహేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, రమేశ్వర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, నర్సింలు, కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, పీసరి సతీ్‌షరెడ్డి పాల్గొన్నారు.పాల్గొన్నారు.

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

షాబాద్‌, నవంబరు 8: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, నరేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలో వివిధ గ్రామాల మధ్య బ్రిడ్జిల నిర్మాణాలకు మంగళవారం జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. చర్లగూడ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి నిర్మాణానికి రూ.2కోట్లు, చర్లగూడ నుంచి మరియాపూర్‌ వరకు ఫార్మేషన్‌ రోడ్డు పనులకు రూ.40లక్షలు, ఆస్పల్లిగూడ స్టేజి నుండి చర్లగూడ వరకు రీబీటీ నిర్మాణానికి రూ.36లక్షలతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొయినాబార్‌ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యుడు కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, చాంద్‌పాష పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T23:34:30+05:30 IST