జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు అండగా ఉంటాం
మేడ్చల్ అర్బన్, అక్టోబరు 17: జర్నలిస్టుల ఆరోగ్య భద్రత విషయంలో అండగా ఉంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ హామీ ఇచ్చారు. సోమవారం ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించడంలో సహకరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజు, ప్రధాన కార్యదర్శి వెంకటరాంరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి.మల్కయ్య ఆధ్వర్యంలో డీఎంఅండ్‌హెచ్‌వోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వ ద వాఖానల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని, ప్రతీ జర్నలిస్టు ప్ర భుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యాన్ని పొందాలన్నారు. అత్యవసర సమయం లో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినపుడు అయ్యే వైద్య ఖర్చుల్లో రాయితీ ఇప్పించేందుకు తనవంతు సహకారం అందజేస్తానని తెలిపారు. అనంతరం బాల్‌రాజు మాట్లాడుతూ మండలాల వారీగా జర్నలిస్టులకు హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి 63రకాల పరీక్షలు చేసి హెల్త్‌ప్రొఫైల్ తయారుచేయాలని కోరారు. నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, ప్రసాద్, వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, బాల్‌రెడ్డి, జగదీశ్వర్, కృష్ణ, శ్రీరాములు, శ్రీధర్, శేషారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీను, రవీందర్ పాల్గొన్నారు.