లింగ వివక్ష లేని సమాజం కోసం పాటుపడాలి
ABN , First Publish Date - 2022-12-16T23:25:20+05:30 IST
లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ అన్నారు.
వికారాబాద్, డిసెంబరు 16: లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం చైల్డ్‌లైన్ 109, ఏహెచ్‌టీయూ ఆధ్వర్యంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల శివారెడ్డిపేటలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. బాలలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షలుతప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్ చాటింగ్‌ల కారణంగా బాలలు మానసిక రుగ్మతలకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడం మంచిందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, ప్రిన్సిపాల్ అనూష, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ రామేశ్వర్, ఏహెచ్‌టీయూ అలీమోద్దీన్, రవీందర్, షీ టీం ఇన్‌చార్జి శీనయ్య, టీచర్లు పాల్గొన్నారు.