సహకార సంఘం ద్వారా బంగారంపై రుణాలు అందజేస్తాం
ABN , First Publish Date - 2022-10-18T05:27:57+05:30 IST
సహకార సంఘం ద్వారా బంగారంపై రుణాలు అందజేస్తాం
కులకచర్ల, అక్టోబరు 17: సహకార సంఘం ద్వారా ఎంతమందికైనా బంగారంపై రుణాలు ఇస్తామని డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సహకార సంఘంలో బంగారం తూకం మిషన్‌ను ఆయన ప్రా రంభించారు. బంగారు రుణాలపై ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎంత మందికైనా ఇస్తామని తెలిపారు. మండల పరిధిలోని రైతులు, ప్రజలు కూడా ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించకుండా సహకార సంఘంలో బంగారంపై రుణాలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్‌చైర్మన్ నాగరాజు, డైరెక్టర్ కొండయ్యగౌడ్, సీఈవో బక్కారెడ్డి, రైతులు పాల్గొన్నారు.