జాబ్‌కార్డు ప్రకారం విధులు నిర్వర్తిస్తాం
ABN , First Publish Date - 2022-12-16T23:23:06+05:30 IST
జాబ్ చార్ట్ ప్రకారంగా కాకుండా వివిధ రకాలైన విధులు బలవంతంగా వీఆర్‌ఏలతో చేయించడం దారుణమని వీఆర్‌ఏల సంఘం చేవెళ్ల మండల అధ్యక్షుడు శంకర్ అన్నారు.
చేవెళ్ల, డిసెంబర్ 16 : జాబ్ చార్ట్ ప్రకారంగా కాకుండా వివిధ రకాలైన విధులు బలవంతంగా వీఆర్‌ఏలతో చేయించడం దారుణమని వీఆర్‌ఏల సంఘం చేవెళ్ల మండల అధ్యక్షుడు శంకర్ అన్నారు. వీఆర్‌ఏల సంఘం పిలుపు మేరకు శుక్రవారం చేవెళ్లలో వీఆర్‌ఏలు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ శ్రీనివా్‌సకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి మండలంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో జాబ్‌కార్డుకు విరుద్ధంగా ఉన్నతాధికారుల సూచన మేరకు వీఆర్‌ఏ నరేందర్ విధులు నిర్వర్తించాడని, ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదానికి గురై మృతిచెందాడని వాపోయారు. రాష్ట్ర వీఆర్‌ఏ జేఏసీ కార్యాచరణ పిలుపు మేరకు ఒకరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండలంలోని వీఆర్‌ఏలు తదితరులు ఉన్నారు.