అభివృద్ధి దిశగా పనిచేశాం

ABN , First Publish Date - 2022-07-07T05:51:59+05:30 IST

అభివృద్ధి దిశగా పనిచేశాం

అభివృద్ధి దిశగా పనిచేశాం
సంబరాల్లో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యులు

  • మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి
  • జడ్పీ ఏర్పడి మూడేళ్లయిన సందర్భంగా సన్మానాలు

మేడ్చల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మూడేళ్లలో జిల్లా పరిషత్‌ నిధులతో అభివృద్ధి దిశగా పనిచేశామని మేడ్చల్‌ జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నారు. జడ్పీ ఏర్పాటై మూడేళ్లయిన సందర్భంగా బుధవారం జడ్పీటీసీ సభ్యులు కేకు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరిని ఒకరు సన్మానించు కున్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని జడ్పీచైర్మన్‌ సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు అనిత, రజిత, మల్లారెడ్డి, సీఈఓ దైవసహాయం, జడ్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more