అందరి కృషితోనే అవార్డు సాధించాం

ABN , First Publish Date - 2022-10-04T05:47:49+05:30 IST

అందరి కృషితోనే అవార్డు సాధించాం

అందరి కృషితోనే అవార్డు సాధించాం
చైర్‌పర్సన్‌ పావని, వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డిని సన్మానిస్తున్న స్థానికులు

ఘట్‌కేసర్‌, అక్టోబరు 3: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ రెండోసారి జాతీయ స్థాయి లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు సాధించడం గర్వంగా ఉందని, అందరి కృషితోనే ఇది సాధ్యం అయిందని చైర్‌పర్సన్‌ ముల్లి పావని అన్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన వారిని  కౌన్సిలర్లు, నాయకులు కలిసి శాలువాతో సత్కరించారు. వరుసగా రెండోసారి జాతీయస్థాయి అవార్డు రావడం గొప్ప విషయం అన్నారు. చైర్‌పర్సన్‌కు, కమిషనర్‌ వసంతకు, పాలకవర్గానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్‌ అనురాధ, మేనేజర్‌ అంజిరెడ్డి, యోగేష్‌, నాయకులు విజయ్‌, వెంకటేష్‌, సిరాజ్‌, రాధాకృష్ణ, ఆంజనేయులు, శశిధరన్‌, వెంకటయ్య నాగభూషణం, రాందాస్‌, వెంకటేష్‌, గోపాల్‌, రవి, నజీర్‌, సత్యనారాయణ, శ్రీశైలం పాల్గొన్నారు.

Read more