గెలుపు పొందు వరకు.. అలుపు లేదు మనకు

ABN , First Publish Date - 2022-12-07T22:50:55+05:30 IST

ఎముకలు కొరికే చలి. కురుస్తున్న మంచు. పొగమంచుతో ఎదుటి వారు కూడా కనిపించని పరిస్థితి. కానీ, ఆ యువతీ యువకులు వీటినేమీ లెక్క చేయడం లేదు. వారి లక్ష్యం ఒకటే.. అదే పోలీస్‌ ఉద్యోగం సాధించడం. ఆ లక్ష్యం ముందు చలి, మంచు కూడా దిగదుడుపే అవుతున్నాయి.

గెలుపు పొందు వరకు.. అలుపు లేదు మనకు

ఎముకలు కొరికే చలి. కురుస్తున్న మంచు. పొగమంచుతో ఎదుటి వారు కూడా కనిపించని పరిస్థితి. కానీ, ఆ యువతీ యువకులు వీటినేమీ లెక్క చేయడం లేదు. వారి లక్ష్యం ఒకటే.. అదే పోలీస్‌ ఉద్యోగం సాధించడం. ఆ లక్ష్యం ముందు చలి, మంచు కూడా దిగదుడుపే అవుతున్నాయి. పోలీస్‌ ఉద్యోగం సాధించాలన్న పట్టుదల వారిలో కసిని నింపుతోంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో విజయం సాధించాలన్న తపన వారిని చలిలోనే నిద్ర లేపుతోంది. ఆ చలిలోనే ఈవెంట్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అంత మంచులోనూ వారికొకటే కనిపిస్తోంది. అదే పోలీస్‌ ఉద్యోగం సాధించాలన్న గురి. ఇంత కఠోర శ్రమ పడుతున్న యువత గెలుపు సాధించేవరకు అలుపు లేదు మనకు అంటూ ఉద్యోగం కోసం పోరాడుతున్నారు.

- పరిగి/ఘట్‌కేసర్‌, డిసెంబరు 7

Updated Date - 2022-12-07T22:50:56+05:30 IST