జల పరవళ్లు..

ABN , First Publish Date - 2022-10-08T05:03:44+05:30 IST

జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు

జల పరవళ్లు..

జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న రాజేంద్రనగర్‌ మండలం బండ్లగూడ జాగీర్‌ సమీపంలోని ఈసీ వాగులోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈసీ వాగు కత్వ అలుగు పారి జలపాతాన్ని తలపిస్తోంది. ఈ జల సవ్వడిని చూడటానికి శుక్రవారం స్థానికులు భారీగా తరలివచ్చారు. చాలామంది ఫొటోలు దిగుతూ ఎంజాయ్‌ చేశారు. కొందరు యువకులు జలాశయంలో ఈత కొడుతూ హుషారుగా గడిపారు.

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రంగారెడ్డి జిల్లాRead more