బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీరు

ABN , First Publish Date - 2022-10-18T05:27:24+05:30 IST

బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీరు

బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీరు

పరిగి రూరల్‌, అక్టోబరు 17: పరిగి మండలం సయ్యద్‌పల్లి లో బోరుబావుల నుంచి నీరు ఉబికి వస్తోంది. గతంలో లక్షలు పెట్టి బోర్లు వేసినా చుక్క నీరు వచ్చేది కాదని, ఇప్పుడు మాత్రం బోర్లలో మోర్టార్‌ నడవకున్నా నీరు ఉబికి వస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మూడు బోర్ల నుంచి నీరు ఉబికి వస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్బ జలమట్టం పెరగడంతోనే నీరు ఉబికి వస్తోందని, ఈ సారి యాసంగి పంటలకు నీటి కొరత ఉండదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-10-18T05:27:24+05:30 IST