వైభవంగా విశ్వకర్మ మహాయజ్ఞం

ABN , First Publish Date - 2022-09-18T05:13:51+05:30 IST

వైభవంగా విశ్వకర్మ మహాయజ్ఞం

వైభవంగా విశ్వకర్మ మహాయజ్ఞం
యజ్ఞంలో పాల్గొన్న దంపతులు

చేవెళ్ల, సెప్టెంబరు 17: చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో శనివారం శ్రీగాయత్రీ విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం 8.15గంటలకు ధ్వజారోహణం, ఉదయం 8.30గంటల నుంచి 11.30గంటల వరకు గణపతి పూజ పుణ్యహవచనం, పంచగవ్య పాలశన, అంకురారోహణం, నవగ్రహ దిక్పాలత పంచబ్రహ్మల పూజలు, గాయత్రీ విశ్వకర్మపూజ నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, గాయత్రీ విశ్వకర్మ హోమం జరిగింది. దంపతులు హోమాల వద్ద పూజలు చేశారు. హోమం ముగిశాక పూర్ణాహుతి, మహా నైవేద్యం, మంగళ హారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ప్రముఖులు విశ్వకర్మ భగవానుడి ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌కు చెందిన శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ప్రతినిధుల భజనలు అలరించాయి. సాయంత్రం విశ్మకర్మ భగవానుడి ఊరేగింపు నిర్వహించారు. యజ్ఞంలో ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, సర్పంచ్‌ శైలజాఆగిరెడ్డి, వైస్‌ఎంపీపీ ప్రసాద్‌, ఎంపీటీసీలు సత్యనారాయణచారి, నరేంద్రచారి, టీఆర్‌ఎస్‌ నాయకులు మిట్ట వెంకటరంగారెడ్డి, ప్రభాకర్‌, మంగలి యాదగిరి, రాంచంద్రయ్యగౌడ్‌, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు ఎ.శ్రీనివాసాచారి, నాయకులు వి.శ్రీనివాసచారి, ఎ.శంభులింగం, వి.ఆంనంద్‌, విశ్వరూపచారి, కె.శ్రీనిసాచారి, వేణుగోపాల్‌చారి, ఆలయ క మిటీ అధ్యక్షుడు వి.లింగాచారి, మాణిక్యచారి, బాలస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-18T05:13:51+05:30 IST