బీజేపీలోకి ఎదులాబాద్ గ్రామస్తులు
ABN , First Publish Date - 2022-10-09T05:30:00+05:30 IST
బీజేపీలోకి ఎదులాబాద్ గ్రామస్తులు
ఘట్‌కేసర్ రూరల్, అక్టోబరు 9 : దేశ ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున అన్నారు. మండల పరిధి ఎదులాబాద్‌కు చెందిన పలువురు యువకులు, మహిళలు ఆదివారం నగరంలోని ఈటల నివాసంలో జమున సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో ఆమె వారికి పార్టీ కండువాలు బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో పోలు నర్సింగ్‌రావు, భాస్కర్‌గౌడ్, చందు, సోమసాని మల్లు, ఆంజనేయులు, శ్రీకాంత్, రాములు, రఘు, భరత్, రమేష్, ప్రదీప్, మహిళలు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ శోభారాణి, అవుషాపూర్ సర్పంచ్ కావేరీ మశ్చేందర్‌రెడ్డి, నాయకులు మశ్చేందర్‌రెడ్డి, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.