మత్స్య సహకార సంఘం గ్రామ కమిటీ
ABN , First Publish Date - 2022-12-07T23:47:16+05:30 IST
మండల పరిధిలోని పెద్దనందిగామ గ్రామంలో బుధవారం మత్స్య సహకార సంఘం నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
కొడంగల్ రూరల్ , డిసెంబరు 7: మండల పరిధిలోని పెద్దనందిగామ గ్రామంలో బుధవారం మత్స్య సహకార సంఘం నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామంలోని మీర్ లాయక్ అలీఖాన్ చెరువు మత్స్య సహకార సంఘం కమిటీని ఎన్నికల అధికారి వెంకటప్ప సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొత్తపేట హన్మంతు, ఉపాధ్యక్షుడిగా తలారి వెంకటయ్య, కార్యదర్శిగా సుంకరి రాములతో పాటు కె.రాములు, కె.లక్ష్మయ్య, కె.రాంకిష్టయ్య, కె.మొగులప్ప, ఎస్.రాంచందర్, నాగయ్యలను డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు.