ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-09-12T04:53:41+05:30 IST

ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి

ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి

నవాబుపేట, సెప్టెంబరు, 11: ప్రతిఒక్కరూ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ మహేశ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో వికారాబాద్‌ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఆదివారం ‘ప్రజల వద్దకు ఆర్టీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాజాత బృందాలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం ఇన్‌చార్జి సంపత్‌, ఆర్టీసీ డిపో సిబ్బంది దేవయ్య పాల్గొన్నారు. 

Read more