గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-08-18T05:39:13+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
రక్తపు మడుగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

కేశంపేట, ఆగస్టు 17: మండల పరిధి కొత్తపేటలో గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, గ్రామస్తులు తెలిపిన వివరాల మేర కు.. కొత్తపేటకు చెందిన పసుల మల్లేష్‌ కూలి చేసుకుంటూ హై దరాబాద్‌ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడు. అతడి మొదటి భార్య వదిలేయడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం మల్లేష్‌, రెండో భార్య, మరో వ్యక్తితో కలిసి కొత్తపేటకు వచ్చారు. రాత్రి వారి ఇంట్లో ముగ్గురు కలిసి విందు చేసుకున్నారు. బుధవారం ఉదయం గ్రామస్తులు మల్లే్‌షతో కలిసి వచ్చిన వ్యక్తి రక్తపు మడుగులో శవమై పడి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెళ్లి పరిశీలించారు. రోకలితో తలపై బాదడంతో ఆ వ్యక్తి చనిపోయినట్లు అంచనా వేశారు. మల్లేష్‌, అతడి భార్య పరారీలో ఉండడంతో వారే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుడు లెంకపోతుల మహేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2022-08-18T05:39:13+05:30 IST