చిరుతదాడిలో రెండు లేగదూడల మృతి

ABN , First Publish Date - 2022-03-06T05:16:23+05:30 IST

చిరుతదాడిలో రెండు లేగదూడల మృతి

చిరుతదాడిలో రెండు లేగదూడల మృతి

కులకచర్ల, మార్చి 5 : మండల పరిధిలోని అనంతసాగర్‌లో చిరుతదాడిలో రెండు లేగదూడలు మృతిచెందాయి. వివరాల్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన రైతు లాలయ్య శుక్రవారం తన పొలం వద్ద పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి చూడగా రెండు లేగదూడలు మృతిచెంది ఉన్నాయి. ఆనవాళ్లు పరిశీలించగా చిరుతదాడిలో మృతిచెందినట్లు గుర్తించారు. ఘటన స్థలాన్ని ఫారెస్టు బీట్‌ అధికారి కాశయ్య సందర్శించారు. కాగా, రైతులు పశువులను రాత్రివేళల్లో పొలాల వద్ద కాకుండా ఇళ్ల వద్ద ఉంచుకోవాలన్నారు. అయితే, ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు ఈ సందర్భంగా కోరాడు.

Updated Date - 2022-03-06T05:16:23+05:30 IST