ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2022-12-12T23:48:22+05:30 IST
ఆలయాల్లో దొంగతనా లకు పాల్పడతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
మేడ్చల్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆలయాల్లో దొంగతనా లకు పాల్పడతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మేడ్చల్ పీఎ్‌సలో విలేకరులతో పేట్‌బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన లారీ డ్రైవర్ ఆంజనేయులు(26), కాళ్లకల్‌లో మటన్ షాప్‌లో పనిచేసే అబ్బాస్(26) ఆలయాల్లో హుండీల్లో డబ్బు చోరీల మార్గాన్ని ఎంచుకున్నారు. మేడ్చల్ వినాయకనగర్‌లో గల రేణుక ఎల్లమ్మ ఆలయం, ఎల్లంపేటలో శివాలయం, ఇంకా కొన్ని ఆలయాల్లో రాత్రి పూట హుండీల్లో డబ్బును చోరీ చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఇద్దరినీ అరె్‌స్టచేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి పల్సర్ బైక్, రెండు సెల్‌ఫోన్‌లను, రూ.10వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.