కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-09-21T05:30:00+05:30 IST

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

పరిగి రూరల్‌, సెప్టెంబరు 21 : టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి అన్నారు. బుధవారం పరిగి మండల పరిధిలోని తొండపల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కావలి సుభాని, గుర్రంపల్లి రాములుకు.. పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉండటంతో బీమా కింద ఒక్కొక్కరికి రూ.2లక్షల చెక్కులను ఎమ్మెల్యే వారి కుటుంబాలకు అందజేశారు. పరిగి పట్టణ కేంద్రంలో దళితబంధు పథకం కింద ఏర్పాటు చేసిన బట్టల షాప్‌ను ఎమ్మెల్యే రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌కుమార్‌, ఎంపీపీ అరవింద్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎ.సురేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు, నాయకులు ప్రవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, బలాల తదితరులు పాల్గొన్నారు. 


Read more