జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు సన్మానం

ABN , First Publish Date - 2022-08-18T05:14:30+05:30 IST

జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు సన్మానం

జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు సన్మానం
డాక్టర్‌ రవిశంకర్‌ను సన్మానిస్తున్న బీసీ సంఘం నాయకులు

 తాండూరు, ఆగస్టు 17 : పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌ను బీసీ సంఘం నాయకులు బుధవారం సన్మానించారు. కాగా, ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, శుభ్రత, ఆసుపత్రి పర్యవేక్షణను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నందున బీసీ సంఘం నాయకులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ రాజు మాట్లాడుతూ డాక్టర్‌ రవిశంకర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు నిరంతరం ఆసుపత్రి పర్యవేక్షణతోపాటు శుభ్రతలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కార్పొరేట్‌ ఆసుపత్రికి దీటుగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్‌ షుకూర్‌, బీసీ మహిళా సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు జ్యోతి, బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్‌, చంద్రశేఖర్‌, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more