గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

గుట్కా ప్యాకెట్ల పట్టివేత
డీఎస్పీ కార్యాలయంలో పట్టుబడిన గుట్కా ప్యాకెట్లను మీడియాకు చూపిస్తున్న డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, ఎస్‌ఐ మధుసూదనరెడ్డి

  • కొత్లాపూర్‌ చెక్‌పోస్టు వద్ద నిరంతర నిఘా : డీఎస్పీ

తాండూరు రూరల్‌, జూలై 18 : తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కొత్లాపూర్‌ చెక్‌పోస్టు వద్ద నిరంతరం నిఘా ఏర్పాటు చేయడంతో కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా అయ్యే గుట్కా ప్యాకెట్లను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తాండూరు డీఎస్పీ జి.శేఖర్‌గౌడ్‌ వెల్లడించారు. సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో కొత్లాపూర్‌ చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల ఘటనపై విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటక తెలంగాణ సరిహద్దులో కొంతకాలంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని, అట్టి చెక్‌పోస్టుల వద్ద తమ పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో కర్ణాటక నుంచి వచ్చే బస్సులను, వాహనాలను తనిఖీ చేయగా, ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఆదివారం రాత్రి 11 గంటలకు చించొళి నుంచి వచ్చే బస్సులను కరన్‌కోట్‌ పోలీసులు చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా, వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన ఉప్పల బాల్‌రాజ్‌ అలియాస్‌ రాజు రూ.11వేలు విలువ చేసే గుట్కాలను బస్సులో పెట్టుకుని వస్తూ తమ సిబ్బందికి పట్టుబడినట్లు చెప్పారు. వీటి విలువ రూ.60వేల వరకు ఉంటుందని తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరుగుతుందని చెప్పారు. కర్ణాటక వైపు నుంచి ఎవరైనా నిషేధిత వస్తువులను తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే పట్టుబడిన ఉప్పలి బాల్‌రాజ్‌ వికారాబాద్‌లోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూదనరెడ్డి ఉన్నారు.

Read more