మృతుల కుటుంబ సభ్యులకు టీపీసీసీ ఉపాధ్యక్షుడి పరామర్శ
ABN , First Publish Date - 2022-08-04T05:46:33+05:30 IST
మృతుల కుటుంబ సభ్యులకు టీపీసీసీ ఉపాధ్యక్షుడి పరామర్శ
బషీరాబాద్, ఆగస్టు 3 : మండలంలోని మంతట్టి గ్రామానికి చెందిన నాటికేరి బుగ్గప్ప, యాదమ్మ బార్య, భర్తలు ఇటీవల కాగ్నా నదిలో వరదకు కొట్టుకుపోయి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ పరామర్శించారు. ఈ మేరకు బుధవారం వారి కుమారుడు వెంకటప్పను ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికాసాయంగా రూ.5 వేలు అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తంచంద్ తదితరులున్నారు.