ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-11T05:39:55+05:30 IST

ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్‌

ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ రామలింగరాజు

మేడ్చల్‌ అక్టోబరు10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి ముఠాను పో లీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం మేడ్చల్‌ పోలీ్‌సస్టేసన్‌లో పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌కు చెందిన విద్యార్థులు మహ్మద్‌ ఇమ్రాన్‌(18), సుమర్‌ అహ్మద్‌ఖాన్‌(20), షేక్‌ సిరాజ్‌(19), అందాన్‌, సల్మాన్‌(26) బైక్‌లు చోరీచేసి గాయల్‌ బాబకు విక్రయించేవారు. సోమవారం మేడ్చల్‌ మార్కెట్‌ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సిరాజ్‌ను పోలీసులు విచారించారు. స్నేహితులతో కలిసి బైక్‌ చోరీలు చేస్తున్నట్లు తెలిపాడు. పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more