ఈ సర్పంచ్‌ మాకొద్దు

ABN , First Publish Date - 2022-10-18T05:27:30+05:30 IST

ఈ సర్పంచ్‌ మాకొద్దు

ఈ సర్పంచ్‌ మాకొద్దు
కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తున్న పెదవేడు గ్రామస్థులు

షాబాద్‌, అక్టోబరు 17: గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండని సర్పంచ్‌ మాకొద్దని షాబాద్‌ మండలం పెదవేడు గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ...  సర్పంచ్‌ శ్రీనివా్‌సగౌడ్‌ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడంలేదని, సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు. గ్రామ సమస్యలపై ఎప్పుడు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని వాపోయారు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-10-18T05:27:30+05:30 IST