మంచితనంతో చెప్పా .. వినకుంటే వేరే పద్ధతి ఆలోచిస్తా
ABN , First Publish Date - 2022-08-16T05:53:27+05:30 IST
మంచితనంతో చెప్పా .. వినకుంటే వేరే పద్ధతి ఆలోచిస్తా

- మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా వ్యవహారంపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తాండూరు, ఆగస్టు 15: తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు రాజీనామా చేయాలని, ఆమెకు మంచితనంతో చెప్పి చూశామని.. వినకుంటే ఇకపై ఇతర పద్ధతిలో ఏం చేయాలో ఆలో చిస్తామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజీనామా వ్యవహారం స్థానికంగా చూసుకోవాలని అధిష్టానం చెప్పలేదన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి సీఎం అపాయింట్మెంటే ఇవ్వలేదన్నారు. మంగళవారం సీఎం సభ, పర్యటనపై మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలకు మాత్రమే పిలుపు వచ్చిందన్నారు. సీఎం సభకు ఎమ్మెల్యేలే చొర వ తీసుకొని లక్ష జన సమీకరణ చేస్తున్నామని, తాండూరు నుంచి 30వేల మందిని తరలిస్తామన్నారు. 40ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవోలు జారీ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు. తాండూరులో నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాల, ట్రామా కేర్‌సెంటర్, ఈఎ్‌సఐ 50పడకల డిస్పెన్సరీ ఏర్పాటు కానుందన్నారు. తాండూరు రింగ్ రోడ్డుకు భూములు కోల్పోయిన నిర్వసితులు 8మందే ఉన్నారని, వారికి పరిహారం ఇప్పిస్తామన్నారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా తనకు గుర్తింపు ఉందన్నారు. ఏడాది లోపు తాండూరు రూపు రేఖలన్నీ మారుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అప్పు, రాజుగౌడ్, శ్రీనివాసాచారి, నర్సింహులు పాల్గొన్నారు.