మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ను కలిసిన తీగల

ABN , First Publish Date - 2022-10-08T04:57:34+05:30 IST

మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్‌, బీజేపీ నేత వీరేందర్‌గౌడ్‌ను

మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ను కలిసిన తీగల
దేవేందర్‌గౌడ్‌తో సమావేశమైన తీగల కృష్ణారెడ్డి

మహేశ్వరం, అక్టోబరు 7 : మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్‌, బీజేపీ నేత వీరేందర్‌గౌడ్‌ను మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీనగర్‌లో గల దేవేందర్‌గౌడ్‌ నివాసంలో వీరు సమావేశమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హోంమంత్రిగా పనిచేసిన దేవేందర్‌గౌడ్‌ను తీగల కృష్ణారెడ్డిలు చాలాకాలం తరువాత కలుసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తీగల కొంత కాలంగా పార్టీ మారుతున్నారని, బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తీగల కృష్ణారెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం టీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ సమయంలో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం దేవేందర్‌గౌడ్‌తోపాటు వీరేందర్‌గౌడ్‌ను కలిసి గంటపాటు సమావేశమయ్యారు. వీరి కలయిక ప్రస్తుతం మహేశ్వరం నియోజకరవర్గంలో చర్చనీయాంశమైంది.Read more