మా భూమి కబ్జాకు యత్నిస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-15T00:14:14+05:30 IST

పులిమామిడి గ్రామంలో ప్లాట్లు చేసిన అమ్మిన 10ఎకరాల భూమిని కొందరు కజ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ప్లాట్ల యజమానులు బుధవారం ఆందోళన చేశారు.

మా భూమి కబ్జాకు యత్నిస్తున్నారు

స్థలం వద్ద మాట్లాడుతున్న ప్లాట్ల ఓనర్లు

కందుకూరు, డిసెంబరు 17: పులిమామిడి గ్రామంలో ప్లాట్లు చేసిన అమ్మిన 10ఎకరాల భూమిని కొందరు కజ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ప్లాట్ల యజమానులు బుధవారం ఆందోళన చేశారు. స్థలానికి కడుతున్న ప్రహరీ గోడను ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేశారు. బాధితులు విలేకరులతో గోడు వెల్లబోసుకున్నారు. పులిమామిడిలోని 93సర్వే నెంబరులో పదెకరాల్లో 2008లో విజయవాడకు చెందిన అప్పటి ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్‌ కొని వెంచర్‌ చేసి ‘వెల్ఫేర్‌’ సొసైటీ పేరుతో ప్లాట్లు విక్రయి ంచారు.ఈ వెంచర్‌లో కరీంనగర్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, నారాయణఖేడ్‌, సిరిసిల్ల, హైదరాబాద్‌ ప్రాంతాల వారు ప్లాట్లు కొన్నట్టు తెలిపారు. తాము దూర ప్రాంతాల వచ్చి ప్లాట్‌చూసుకొని వెళ్లేవారం అన్నారు. తాము ఇక్కడ లేకపో యేసరికి కొందరు రాజకీయ అండతో కబ్జాకు యత్నిం చారని ఆరోపించారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అండతోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హన్మంత్‌నాయక్‌ కజ్జాకు యత్నిస్తున్నాడని ప్లాట్ల ఓనర్లు ఆరోపించారు. పేదల భూ మి కజ్జా కాకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని, లేకు ంటే ఎంపీ రంజీత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఈ సంద ర్భంగా ప్లాట్ల ఓనర్లు స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-15T00:14:15+05:30 IST