రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ
ABN , First Publish Date - 2022-12-31T00:06:41+05:30 IST
తాండూరు మండలం మల్కాపూర్ ఇండియా సిమెంటు కర్మాగారంలోని క్వార్టర్స్‌లో తాళం పగలగొట్టి రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కరన్‌కోట్ ఎస్‌ఐ మధుసూధనరెడ్డి తెలిపారు.
తాండూరు రూరల్, డిసెంబరు 30 : తాండూరు మండలం మల్కాపూర్ ఇండియా సిమెంటు కర్మాగారంలోని క్వార్టర్స్‌లో తాళం పగలగొట్టి రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కరన్‌కోట్ ఎస్‌ఐ మధుసూధనరెడ్డి తెలిపారు. ఐసీఎల్ కర్మాగారంలో అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి గదికి తాళం వేసుకుని వెళ్లాడు. మధ్యరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటికి వేసిన తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ప్రవేశించి బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందితులను పట్టుకుని సొత్తు రికవరీ చేసేందుకు యత్నిస్తామన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున ్నట్లు తెలిపారు.