ఆవు, కోడె దూడల చోరీ

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఆవు, కోడె దూడల చోరీ

ఆవు, కోడె దూడల చోరీ

చౌదరిగూడ, మార్చి 5: ఆవు, కోడె దూడలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెల్లిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని రావిరాల గ్రామంలో చోటుచేసుకుంది. రావిరాలకు చెందిన వడ్డె తిర్మలయ్యకు చెందిన ఒక ఆవు, కోడెదూడ, వడ్డె రంగయ్యకు చెందిన మూడు కోడెదూడలను ఎప్పటిలాగే పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం పాలు తీసుకురావడానికి పొలం వద్దకు వెళ్లగా ఆవు, దూడలు కనిపించలేదు. దీంతో వెంటనే 100కి డయల్‌ చేయగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రూ.లక్ష విలువ చేసే ఆవు, దూడలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more