షాద్‌నగర్‌ బస్టాండ్‌లో మళ్లీ చోరీ

ABN , First Publish Date - 2022-08-27T05:18:27+05:30 IST

షాద్‌నగర్‌ బస్టాండ్‌లో మళ్లీ చోరీ

షాద్‌నగర్‌ బస్టాండ్‌లో మళ్లీ చోరీ

షాద్‌నగర్‌ రూరల్‌, ఆగస్టు 26: షాద్‌నగర్‌ బస్టాండ్‌లో దొంగలు చెలరేగిపోతున్నారు. పది రోజుల వ్యవధిలో రెండో సారి ప్రయాణికురాలి మెడలో బంగారు గొలుసును అపహరించారు. గతంలో గాంధీనగర్‌ కాలనీకి చెందిన ఓమహిళ తన బ్యాగులో ఏడు తులాల బంగారు ఆభరణాన్ని పెట్టుకుని మహబూబ్‌నగర్‌ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తాజాగా శుక్రవారం అదే కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ బ్యాగులో మూడు తులాల బంగారు గొలుసు పెట్టుకుని మహబూబ్‌నగర్‌ బస్సు ఎక్కుతుండగా చోరీ చేశారు. బస్సు ఎక్కి టిక్కెట్‌ కోసం బ్యాగు చూసుకోగా బంగారం కనిపించలేదని బాధితురాలు వాపోయింది. బస్టాండ్‌లో సీసీకెమెరాలు పనిచేయక పోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-27T05:18:27+05:30 IST