నిప్పంటించుకున్న మహిళ మృతి

ABN , First Publish Date - 2022-12-16T23:05:16+05:30 IST

వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్ల ఎస్టీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ వేధింపులు తాళలేక ఒంటికి నిప్పంటించుకున్న సుజాత అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో మృతిచెందారు.

నిప్పంటించుకున్న మహిళ మృతి
కులకచర్ల చౌరస్తాలో ఆందోళన చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన స్కావెంజర్‌ కూతురు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత

బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన

కులకచర్ల, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్ల ఎస్టీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ వేధింపులు తాళలేక ఒంటికి నిప్పంటించుకున్న సుజాత అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మృతి పట్ల బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఆందోళన చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ గంగారాంపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాఠశాల స్కావెంజర్‌ సుగుణమ్మ అనారోగ్యానికి గురైంది. ఆమెకు బదులుగా కూతురు సుజాత విధులు నిర్వహించేది. ప్రిన్సిపాల్‌ గంగారాం తరుచూ వేధించి చివరికి విధుల నుంచి తొలిగించాడు. దీంతో సుజాత ఈ నెల 6న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రిన్సిపాల్‌ గంగారాంపై కేసు నమోదు చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రహ్లాద్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌, మండల అధ్యక్షుడు మహిపాల్‌, నాయకులు కాటన్‌పల్లి అంజిలయ్య, జానక్‌రాం, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్‌, హరినాథ్‌రెడ్డి, జలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:05:17+05:30 IST