జడ్జి అభిషేక్‌రెడ్డి బదిలీని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-11-19T00:02:44+05:30 IST

తెలంగాణ హైకోర్టు జడ్జి ఎ.అభిషేక్‌రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయం సరి కాదని. ఆయన్ను ఇక్కడే కొనసాగించాలని ఇబ్రహీంపట్నం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాదన్న, కార్యదర్శి రవికిరణ్‌ డిమాండ్‌ చేశారు.

జడ్జి అభిషేక్‌రెడ్డి బదిలీని రద్దు చేయాలి
ఇబ్రహీంపట్నంలో నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు నవంబరు 18: తెలంగాణ హైకోర్టు జడ్జి ఎ.అభిషేక్‌రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయం సరి కాదని. ఆయన్ను ఇక్కడే కొనసాగించాలని ఇబ్రహీంపట్నం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాదన్న, కార్యదర్శి రవికిరణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ జడ్జిలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. జడ్జి అభిషేక్‌రెడ్డి బదిలీని నిరసిస్తూ ఆమనగల్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయవాదులు విధుల బహిష్కరించారు. కోర్టు వద్ద నిరసన తెలిపారు. కొందరు న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. బదిలీని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుయాదవ్‌, సహ కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి శేఖర్‌, మధు, బిక్యా, మల్లేశ్‌, గణేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:02:45+05:30 IST