బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2022-07-06T05:09:46+05:30 IST

బంద్‌ విజయవంతం

బంద్‌ విజయవంతం
వికారాబాద్‌లో పాఠశాలలను బంద్‌ చేయిస్తున్న ఏబీవీపీ నాయకులు

వికారాబాద్‌, జూలై5 : విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ మంగళవారం ఇచ్చిన విద్యా సంస్థల బంద్‌ పిలుపు విజయవంతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం దుస్తులు వెంటనే పంపిణీ చేయాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, ఫీజు నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు జిల్లాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలను మూసివేశారు. కొన్ని మండలాల్లో కూడా పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి నోట్‌ పుస్తకాలు, యూనిఫాం, టై, షూస్‌, స్టేషనరీ విక్రయాలు కొనసాగిస్తున్నారని, పాఠశాలల్లో కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-07-06T05:09:46+05:30 IST