కూల్చివేతలను అడ్డుకున్న బస్తీవాసులు

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

కూల్చివేతలను అడ్డుకున్న బస్తీవాసులు

కూల్చివేతలను అడ్డుకున్న బస్తీవాసులు
పోలీసులతో వాదనకు దిగిన బస్తీవాసులు

ఇబ్రహీంపట్నం, మార్చి 5: ఇబ్రహీంపట్నం టౌన్‌ నాగన్‌పల్లివైపు వెళ్లే రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీల సాయంతో మున్సిపల్‌ అధికారులు శనివారం ఇళ్ల కూల్చివేత చేపట్టగా బస్తీవాసులు అడ్డుపడ్డారు. ముందుగా సమాచారం ఇచ్చే కూల్చివేతలు చేస్తున్నామని మున్సిపల్‌ అధికారులు సమాధానమిచ్చారు. ఐసీడీఎస్‌ కార్యాలయం నుంచి టౌన్‌ చివర నాగన్‌పల్లి రోడ్డు వరకు 46ఫీట్ల వెడల్పుతో పనులు చేపడుతున్నట్లు ఆధికారులు చెప్పారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బస్తీవాసులు ససేమిరా అనడంతో కూల్చివేతలు అర్ధాంతరంగా నిలిపివేశారు.

Read more