చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2022-12-31T23:55:43+05:30 IST

మండలంలోని చిన్నమంగళారం గ్రామం నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ కారును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది.

చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మొయినాబాద్‌ రూరల్‌, డిసెంబరు 31: మండలంలోని చిన్నమంగళారం గ్రామం నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ కారును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన టిప్పుఖాన్‌ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ పరిసరాల్లో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిన్నమంగళారం నుంచి శనివారం ఉదయం 8:00గంటలకు ప్రయాణికులతో మెహదీపట్నం బయలుదేరింది. మార్గమధ్యలో లంగర్‌హౌ్‌సలోని టిప్పుఖాన్‌ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ ప్రాంతంలోని మూలమలుపు వద్ద ఓ కారును బస్సు డ్రైవర్‌ ఓవర్‌టెక్‌ చేయబోయాడు. దీంతో ప్రమాదవశాత్తు బస్సు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులున్నారు. నలుగురికి తీవ్రగాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-12-31T23:55:44+05:30 IST