మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-12-16T23:37:05+05:30 IST
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
పరిగి రూరల్, డిసెంబరు 16: మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం జాఫర్‌పల్లి, రాఘవపూర్ 135ఎంఎల్‌డీ నీటిశుద్ధి కేంద్రం వద్ద వారు ధర్నా చేశారు. కార్మికులకు జీవో నెం.11 ప్రకారం రూ.26వేల వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, బోనస్ కల్పించాని డిమాండ్ చేశారు. కార్మికులకు 8గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. వారాంతపు సెలవులు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.