మాచన్‌పల్లి గ్రామ సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-10-18T05:26:11+05:30 IST
మాచన్‌పల్లి గ్రామ సమస్యలను పరిష్కరించాలి
షాబాద్, అక్టోబరు 17: మాచన్‌పల్లి గ్రామ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌లో గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానరోడ్డు నుంచి గ్రామంలోకి రావాలంటే గుంతలు పడి నడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాపాలవుతున్నారని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో అండర్ డ్రైనేజీ లేక ఎక్కడి మురుగు అక్కడే ఉండి రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. గ్రామంలో 10సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కుమార్, గిరిష్, రాజశేఖర్, నరేందర్, సత్యనారాయణ, వెంకటయ్య, విఠల్, నర్సింహులు, శ్రీశైలం ఉన్నారు.