ప్రధాని సభను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST

ప్రధాని సభను జయప్రదం చేయాలి

ప్రధాని సభను జయప్రదం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌

వికారాబాద్‌, జూన్‌ 24 : జూలై 3న హైదరాబాద్‌లో  నిర్వహించే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు, మండల అధ్యక్షులు, ఇన్‌చార్జి, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, దానిని అంతమొందించే సమయం ఆసన్నమైందని కార్యకర్తలకు సూచించారు. కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించే సత్తా బీజేపీ కార్యకర్తలకే ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. కాగా, మోదీ సభకు వికారాబాద్‌ నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తరలివెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి, జిల్లా నాయకులు శివరాజు, పాండుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-24T05:30:00+05:30 IST