పేదల కడగండ్లు తీరుస్తా

ABN , First Publish Date - 2022-01-24T04:56:21+05:30 IST

పేదల కడగండ్లు తీరుస్తా

పేదల కడగండ్లు తీరుస్తా
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే

యాచారం/కొందుర్గు/కేశంపేట, జనవరి 23: పేదల కడగండ్లు తీర్చి ఆదుకుంటానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎం.కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మంతన్‌గౌరెల్లికి చెందిన సపావట్‌పెంటి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధిని మంజూరు చేసినట్లు తెలిపారు. బాధితురాలికి రూ.3లక్షల చెక్కును ఆదివారం అందజేశారు. ఎమ్మెల్యే వెంట మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రమే్‌షగౌడ్‌, తదితరులు ఉన్నారు. అదేవిధంగా కేశంపేట మండలంలోని నిర్థవెల్లి గ్రామానికి చెందిన బి.గణే్‌షకు రూ.32వేలు, బి.యాదమ్మకు రూ.12వేలు, చింతకుంటపల్లి గ్రామానికి చెందిన డి.సాయిలమ్మకు రూ.31,600 సీఎం సహాయనిధి ద్వారా మంజూరయ్యాయి. ఎక్లా్‌సఖాన్‌పేటలో ఆదివారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, రమే్‌షయాదవ్‌, బడ్క వెంకటయ్య, వెంకటేష్‌ పాల్గొన్నారు. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన తీగలపల్లి గోపాల్‌కు సీఎం సహాయనిధి ద్వారా వచ్చిన రూ.21,500 మంజూరయ్యాయి. ఈచెక్కును ఆదివారం వైస్‌ ఎంపీపీ రాజే్‌షపటేల్‌ మండల కేంద్రంలోని జీఎంపటేల్‌ గార్డెన్‌లో అందజేశారు. జి.జగదీశ్వర్‌గౌడ్‌, రామకృష్ణ, జె.గోపాల్‌, కలాం, భీమయ్య పాల్గొన్నారు.  

Read more