రాజీ మార్గమే రాజమార్గం : పర్హిన్‌ కౌసర్‌

ABN , First Publish Date - 2022-08-14T05:48:42+05:30 IST

రాజీ మార్గమే రాజమార్గం : పర్హిన్‌ కౌసర్‌

రాజీ మార్గమే రాజమార్గం : పర్హిన్‌ కౌసర్‌
మహేశ్వరం: లోక్‌ అదాలత్‌లో కేసులను పరిశీలిస్తున్న జడ్జి పర్హిన్‌కౌసర్‌

మహేశ్వరం/చేవెళ్ల, ఆగస్టు 13: సమస్యల పరిష్కారానికి రాజీ మార్గమే రాజమార్గమని మహేశ్వరం జూనియర్‌ సివిల్‌కోర్టు జడ్జి పర్హిన్‌ కౌసర్‌ అన్నారు. మహేశ్వరంలో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 739 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం సీఐలు, పలువురు న్యాయవాదులు ఇస్రాయేలు, అశోక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మున్సి్‌ఫకోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో చేవెళ్ల మున్సి్‌ఫకోర్టు న్యాయమూర్తి జీవన్‌ సురజ్‌ సింగ్‌ పాల్గొన్నారు. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మొత్తం 3255 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ గురవయ్యగౌడ్‌, న్యాయవాదులు సురేశ్‌, మల్లేశ్‌, జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:48:42+05:30 IST