ఆరు నెలల్లో మారనున్న గ్రామాల రూపురేఖలు

ABN , First Publish Date - 2022-12-07T00:00:55+05:30 IST

ఆరు నెలల వ్యవధిలో గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. పల్లెపల్లెకు పైలెట్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బషీరాబాద్‌, గంగ్వార్‌, క్యాద్గీరా, అల్లాపూర్‌, దామర్‌చెడ్‌, నంద్యానాయక్‌తండా, కోత్లాపూర్‌ తదితర గ్రామాల్లో పర్యటించారు.

ఆరు నెలల్లో మారనున్న గ్రామాల రూపురేఖలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

బషీరాబాద్‌, డిసెంబరు 6 : ఆరు నెలల వ్యవధిలో గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. పల్లెపల్లెకు పైలెట్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బషీరాబాద్‌, గంగ్వార్‌, క్యాద్గీరా, అల్లాపూర్‌, దామర్‌చెడ్‌, నంద్యానాయక్‌తండా, కోత్లాపూర్‌ తదితర గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. సొంత స్థలం ఉండి.. ఇల్లు లేని వారికి రూ.3లక్షలు ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందన్నారు. అంతకు ముందు బషీరాబాద్‌లో సీసీరోడ్డు, అండర్‌డ్రైనేజీ పైపులైన్‌ పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌చారి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రామునాయక్‌, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:00:56+05:30 IST