ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగరాలి
ABN , First Publish Date - 2022-08-10T05:55:03+05:30 IST
ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగరాలి

- ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, డాక్టర్ ఆనంద్, నరేందర్‌రెడ్డి
- స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా త్రివర్ణ పతాకాలు పంపిణీ
వికారాబాద్/పరిగి/కొడంగల్/బొంరా్‌సపేట్/దౌల్తాబాద్/పూడూర్/తాండూరు/తాండూరు రూరల్/పెద్దేముల్/బషీరాబాద్/దోమ/ఘట్కేసర్ రూరల్/ఘట్కేసర్/కీసర/కీసర రూరల్/మేడ్చల్/కులకచర్ల, ఆగస్టు 9 : 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని పరిగి, వికారాబాద్, కొడంగల్ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, డాక్టర్ ఆనంద్, పట్న నరేందర్‌రెడ్డిలు వేర్వేరు కార్యక్రమాల్లో పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా సమాఖ్య సంఘాల మహిళలందరికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ జాతీయ జెండాను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ పాండు, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గోపాల్, మండల కోఆప్షన్ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగిలోని పురపాలక, మండల పరిషత్ కార్యాలయాల్లో జెండాలను పంపిణీ చేశారు. మునిసిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఏఎంసీ చైర్మన్ సురేందర్, ఎంపీడీవో శేషగిరిశర్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆర్.అంజనేయులు, నాయకులు బి.ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ ఉషారాణి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, కొడంగల్ మండల పరిధిలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్‌లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులుకు త్రివర్ణ పతాకాలను ఎమ్మెల్యే అందించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు జీ.రాంరెడ్డి, టిటి.రాములునాయక్, రమేశ్‌బాబు, సర్పంచ్‌లు పకీరప్ప, సయ్యద్ అంజద్, వెంకట్‌రెడ్డి, టి.సావిత్రమ్మసాయిలు, శంకర్‌నాయక్, కాశప్ప, ఫయీమోద్దీన్, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగే శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కట్కం శివకుమార్‌గుప్త, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బొంరా్‌సపేట్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ హేమీబాయి చేతుల మీదుగా త్రీవర్ణ పతకాలను అందించారు. మండలంలోని అన్నీ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించి వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఎంపీడీవో పాండునాయక్, వైస్‌ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, శేరినారాయణరెడ్డి, దేశ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డప్పులతో ఊరేగింపు నిర్వహించారు. పూడూర్ మండల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ మేఘమాల తదితరులు త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పటేల్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో తిరుమలస్వామి, ఎంపీవో రవీందర్ తదితరులు జెండాలు అందించారు. కాగా, వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉన్నందున ప్రజలంతా పాల్గొనాలని తాండూరు రూరల్ సీఐ రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలను విజయంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని తాండూరు ఎంపీపీ అనితాగౌడ్ కోరారు. మంగళవారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలంతా తమ ఇళ్లపై జెండాలను ఎగురవేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, కరన్‌కోట్ ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ స్వరూపా, మండల పంచాయతీ అధికారి రతన్‌సింగ్, సర్పంచ్‌లు విజయల క్ష్మీ, రాధిక, మల్లీశ్వరిగౌడ్, ఎంపీటీసీలు రత్నమాల, సాయిరెడ్డి, శాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని పిలుపు మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని 9, 24వ వార్డుల్లో జాతీయ జెండాలను ఇంటింటికి పంపిణీ చేశారు. పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపానర్సింహులు, 24వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత వేర్వేరుగా జెండాలను పంపిణీ చేశారు. 24వ వార్డులో జరిగిన కార్యక్రమంలో వార్డు ఆర్పీ శ్రీదేవి, అంగన్వాడీ టీచర్లు భాగ్యమ్మ, మున్సిపల్ సిబ్బంది భూపతి, బూత్ అధ్యక్షురాలు నర్సమ్మలు ఇంటింటికి వెళ్లి జెండాలను పంపిణీ చేశారు. ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలని ఎంపీడీవో లక్ష్మప్ప తెలిపారు. పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనురాధరమే్షతో కలిసి ఎంపీడీవో లక్ష్మప్ప సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు జాతీయజెండాలను పంపిణీ చేశారు. ఆర్ఐ.రాజిరెడ్డి, ఎంపీఈవో సుష్మ, స్థానిక సర్పంచ్ విజయమ్మ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని బషీరాబాద్ ఎంపీపీ కరుణఅజయ్‌ప్రసాద్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులకు గ్రామాల వారీగా జెండాలను అందజేశారు. జడ్పీటీసీ మిర్యాణం శ్రీనివా్‌సరెడ్డి, సూపరింటెండెంట్ విజయకుమారి, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. అదేవిదంగా వజ్రోత్సవాలను పురస్కరించుకుని తాండూరు మండలం మల్కాపూర్‌లో సర్పంచ్ విజయలక్ష్మి పండరి ఇంటింటికీ జెండాలను పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు, నాయకులు మైనుద్దీన్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దోమలో ఎంపీపీ అనసూయ, వైస్‌ఎంపీపీ మల్లేశం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు జాతీయ పతాకాలు అందజేశారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, బీజేవైఎం మండలాధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో పతాకాలను అందజేశారు. ఎంపీడీవో జయరాం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ జాతీయ జెండాను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ప్రతా్‌పసింగారం, కొర్రెములలో జరిగిన ఇంటింటికీ జాతీయజెండా కార్యక్రమంలో ఆయన పాల్గొని పతాకాలు పంపిణీ చేశారు. అవుశాపూర్, అంకుషాపూర్, మాదారం, మర్రిపల్లిగూడ, ఎదులాబాద్, కాచవానిసింగారం, వెంకటాపూర్ ఘణాపూర్ తదితర గ్రామాల్లో జెండాను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో అరుణారెడ్డి, సర్పంచ్‌లు వంగూరి శివశంకర్, ఓరుగంటి వెంక టేష్‌గౌడ్, కాలేరు సురేష్, ఏనుగు కావేరి, కొమ్మిడి జలజా, యాదగిరి, చిలుగూరి మంగమ్మ, కొంతం వెంకట్‌రెడ్డి, గోపాల్‌రె డ్డి, నీరుడి గీత,ఉపసర్పంచ్లు కందులరాజు, అబేదాబేగం, మాయ నరేష్, అయిలయ్యయాదవ్, లింగేశ్వర్‌రావు, రవి, గీత, వార్డుసభ్యులు, కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీ నగర్లో చైర్పర్సన్ పావని, కమిషనర్ వసంత, కౌన్సిలర్ రమాదేవి స్థానికులతో కలిసి జెండాలను పంపిణీ చేశారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో చైర్మన్ కొండల్‌రెడ్డి, కమిషనర్ సురేష్, వైస్ చైర్మన్ రెడ్డియానాయక్, స్థానికులతో కలిసి జెండాలను పంపిణీ చేశారు. అలాగే ఆయా వార్డుల్లోనూ కౌన్సిలర్లు జాతీయ జండాలను పంపిణీ చేశారు.
కీసర మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ జెండాలను పంపిణీ చేసి వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన త్యాగదనుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆయా మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసారు. కమిషనర్లు వాణి, స్వామి, నాగారం మున్సిపల్ మేనేజర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాల్టీలతో పాటు మండలంలోని గ్రామాల్లో ఇంటింటికీ జెండాలను పంపిణీ చేశారు. చైర్పర్సన్లు మర్రి దీపికనర్సింహారెడ్డి, మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, ఎంపీపీ వీర్లపల్లి రజితారాజమల్లారెడ్డిల ఆధ్వర్యంలో ఇంటింటికీ జెండాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.
అదేవిధంగా ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగరేయాలని జడ్పీటీసీ రాందాస్‌నాయక్ తెలిపారు. కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించి పంచాయతీ కార్యదర్శులకు జెండాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాంలాల్‌నాయక్, ఎంపీవో కరీం, తదితరులు పాల్గొన్నారు.