వైభవంగా శ్రీరాజరాజేశ్వరీదేవి కల్యాణం

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

వైభవంగా శ్రీరాజరాజేశ్వరీదేవి కల్యాణం

వైభవంగా శ్రీరాజరాజేశ్వరీదేవి కల్యాణం
కందుకూరు: కొత్తగూడలో అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

కందుకూరు, మార్చి 5: మండలంలోని కొత్తగూడ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారి కల్యాణోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం అమ్మవారికి భక్తులు ప్రత్యేకపూజలు, కుంకుమార్చన, అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వైకుంఠం, బీజేపీ జిల్లా అద్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, జ్యోతి, బి,మాధవరెడ్డి, ఎస్‌.శేఖర్‌గౌడ్‌, లక్ష్మణ్‌ ముదిరాజ్‌, వెంకటే్‌షగౌడ్‌, తిరుపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి, శంకరయ్య, బొక్క ఎల్లారెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు. 

వైభవంగా శ్రీవేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

ఆమనగల్లు, మార్చి 5: మండలంలోని చరికొండ వేణుగోపాలస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయామానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలో భాగంగా తొలి రోజు రుక్కిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మూలవిరాట్‌లను పట్టు వస్త్రాలతో అలంకరించి అర్చకుడు, ఆలయ నిర్వాహకుడు చక్రవర్తి శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలకుర్ల అద్దాల రాములు, లాల్‌కోట భారతమ్మ, పాలకుర్ల లక్ష్మమ్మ, గౌని యాదమ్మలక్ష్మమ్మ పాల్గొన్నారు.

ఘనంగా పెద్ద రథోత్సవం 

ఆమనగల్లు మండల పరిధిలోని అయ్యసాగర్‌ శ్రీత్రిపురాంత కేశ్వర వీరభద్రస్వామి భద్రకాళి, సరస్వతి, శ్రీరామాంజనేయస్వామి దేవాలయంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున పెద్ద రథోత్సవం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సోన శ్రీను నాయక్‌, ఎంపీటీసీ సరితపంతూనాయక్‌, రచ్చ శ్రీరాములు, బట్టు నర్సిరెడ్డి, మల్లప్ప, పంచాక్షరి, వైద్యనాథ్‌, యాదగిరి రెడ్డి, వీరయ్య పాల్గొన్నారు.

అంజనేయస్వామి ఆలయంలో పల్లకీసేవ

షాద్‌నగర్‌అర్బన్‌, మార్చి 5: మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పల్లకీసేవను నిర్వహించారు. 6వ వార్డు కౌన్సిలర్‌ పి.లతశ్రీశ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమాన్ని ఆలయ పూజారులు రాఘవేందర్‌, రాఘుపతిరావు, కృష్ణలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలు

కేశంపేట, మార్చి 5: మండలంలోని కాకునూర్‌ గ్రామ శివారులోని మహాలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. కాకునూర్‌, లేమామిడి, నిర్థవెల్లి గ్రామానికి చెందిన భక్తులు స్వామివారి ఆలయంలో పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య సత్యనారాయణస్వామి వారి వత్రాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉదయం భక్తులు అగ్నిగుండంలో నిప్పులను తొక్కారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గండ్ర లక్ష్మమ్మ, విండో చైర్మన్‌ జగదీశ్వర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ తైద పర్వతాలు, ఆలయ కమిటీ చైర్మన్‌ రమే్‌షగౌడ్‌, ఆలయ పూజారులు మహాలింగం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST