వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-17T05:46:52+05:30 IST

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
బొంరాస్‌పేట్‌: వీఆర్‌ఏల సమ్మెలో పాల్గొని మాట్లాడుతున్న బుస్స చంద్రయ్య

  • సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య 

బొంరా్‌సపేట్‌, ఆగస్టు 16: వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని, పే-స్కేలు, పదోన్నతులు తదితర డిమాండ్ల సాధన కోసం 23 రోజులుగా సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య అన్నారు. మంగళవారం బొంరా్‌సపేట్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని వీఆర్‌ఏలు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. ప్రజాసంఘాల నాయకులు డప్పు వెంకటయ్య, వీఆర్‌ఏల సంఘం మండలాధ్యక్షుడు యం.మోహన్‌, జేఏసీ జిల్లా కో కన్వీనర్‌ రాజ్‌కుమార్‌, వీఆర్‌ఏలు రాములు, వెంకట్రాములు, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

  • వీఆర్‌ఏలకు బీఎస్పీ నాయకుల మద్దతు

పెద్దేముల్‌ : తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. మంగళవారం పెద్దేముల్‌ మండల కేంద్రలో బీఎస్పీ నాయకులు వీఆర్‌ఏల సమ్మెకు మద్దతు తెలిపారు. ఎంపీటీసీ, న్యాయవాది అంబరయ్య, రాజు తదితరులున్నారు.

  • వీఆర్‌ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

కులకచర్ల : వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మండల కేంద్రంలో వీఆర్‌ఏల సమ్మెకు మద్దతుగా పాల్గొని ఆయన ప్రసంగించారు. వీఆర్‌ఏలు డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. వీఆర్‌ఏలు ఓంప్రకాశ్‌, వెంకట్‌, కిష్టయ్య, నర్సింహులు, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:46:52+05:30 IST