దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-07T05:30:00+05:30 IST

దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

కొత్తూర్‌, జూలై 7: కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వైఎం తండా గ్రామపంచాయతీలోని పులిచర్లకుంట తండాకు పాత్లావత్‌ దశరథ్‌(42) అనే వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. గత నెల 29న దశరథ్‌పై అదే తండాకు చెందిన తుల్స్యనాయక్‌ మద్యం మత్తులో దాడి చేసి గాయపరిచాడు. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దశరథ్‌ మృతిచెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Read more