ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది: మల్‌రెడ్డి రంగారెడ్డి

ABN , First Publish Date - 2022-06-22T20:25:11+05:30 IST

రంగారెడ్డి: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటివారంలో రావాల్సిన రైతుబంధు నేటికి విడుదల కాలేదన్నారు. HMDAను

ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది: మల్‌రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటివారంలో రావాల్సిన రైతుబంధు నేటికి విడుదల కాలేదన్నారు. HMDAను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని, ఈ వ్యవహారాన్ని రంగారెడ్డి జిల్లా అధికార పార్టీ నేతలు ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. దళితులకు ఇచ్చిన భూములను అధికార పార్టీ స్థానిక నేతలు బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక, రాచరిక పాలన సాగుతోందన్నారు. రైతులను వంచించడానికే ధరణి పోర్టల్ తెచ్చారని విమర్శించారు. పోలీసులు లేకుండా అధికార పార్టీ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు.  

Updated Date - 2022-06-22T20:25:11+05:30 IST